ఒక్కటైన అమెరికా మాజీ అధ్యక్షులు
MarinaSkies
Kizen

ఒక్కటైన అమెరికా మాజీ అధ్యక్షులు

06-10-2017

ఒక్కటైన అమెరికా మాజీ అధ్యక్షులు

ఇటీవల కాలంలో అమెరికా దక్షిణ ప్రాంతాన్ని, కరీబియన్‌ దీవులను భారీగా  కుదిపేసిన హార్వీ, ఇర్మా, మరియా తుపానుల బాధితులను ఆదుకునేందుకు అమెరికా చెందిన ఐదుగురు మాజీ అధ్యక్షులు నడుంబిగించారు. తుపాను బాధితులను ఆదుకునేందుకు అవసరమైన నిధుల సేకరణ కోసం రంగంలోకి దిగిన మాజీ అధ్యక్షులు బరాక్‌ ఒబామా, జార్జ్‌ బుష్‌, బిల్‌ క్లింటన్‌, జార్జ్‌ బుష్‌ (సీనియర్‌) జిమ్మీ కార్టర్‌లు ఈ నెల 21న టెక్సాస్‌లోని ఎఅండ్‌ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరు కానున్నారు. ప్రత్యర్థి పక్షాలకు చెందిన ఇద్దరు రిపబ్లికన్‌ నేతలు, ముగ్గురు డెమొక్రాట్‌ నేతలు తుపాను బాధితుల కోసం పరస్పరం చేయి కలపటం విశేషం.