15 రోజుల్లో హెచ్‌-1బీ వీసాల నిర్ణయం
APEDB

15 రోజుల్లో హెచ్‌-1బీ వీసాల నిర్ణయం

06-10-2017

15 రోజుల్లో హెచ్‌-1బీ వీసాల నిర్ణయం

భారతీయ ఐటీ నిపుణులు సహా, ఇతర వర్గాల ఉద్యోగులు పెట్టుకున్న వీసాల దరఖాస్తులో కదలిక ప్రారంభమయింది. హెచ్‌-1బీ వీసాల అధిక మూల్య విశ్లేషణను అమెరికా ప్రభుత్వం పున ప్రారంభించింది. ఈ వీసాల కోసం భారీ ఎత్తున దరఖాస్తులు రావడంతో వీటీ ప్రీమియం ప్రాసెసింగ్‌ను తాత్కాలికంగా రద్దుచేస్తూ గత ఏప్రిల్‌ నెలలో నిర్ణయం తీసుకుంది. కొన్ని రకాల వృత్తుల వారు పెట్టుకున్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలంటూ గత సెప్టెంబరు నెలలో నిర్ణయాన్ని కాస్త సడలించింది. ప్రస్తుతం అన్ని రకాల వృత్తుల వారు పెట్టుకున్న దరఖాస్తులను కూడా పరిశీలించనున్నట్లు అమెరికా పౌరసత్వ, వలసేవల (యుఎస్‌సిఐఎస్‌) అధికార వర్గాలు తెలిపాయి. ప్రీమియం ప్రాసెసింగ్‌ కింద దరఖాస్తును పరిశీలించడానికి ఒకరోజు గడువు ఉంటుంది. ఆ లోగా ఎలాంటి నిర్ణయం వెలువడకపోతే వీసా కోసం చెల్లించిన రుసుమును వాపసు చేస్తారు. అయితే ఈ దరఖాస్తును తదుపరి పరిశీలనకు స్వీకరిస్తారు. అమెరికా సంస్థలు సాంకేతిక, సైద్ధాంతిక నైపుణ్యం ఉన్న విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి అవకాశాన్ని కల్పించేదే హెచ్‌-1బీ వీసా.