బ్లాక్‌ టీ తో బరువు తగ్గుముఖం
MarinaSkies
Kizen

బ్లాక్‌ టీ తో బరువు తగ్గుముఖం

05-10-2017

బ్లాక్‌ టీ తో బరువు తగ్గుముఖం

బరువు తగ్గేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారా? అయితే రోజుకు ఓ కప్పు బ్లాక్‌ టీ తాగండి. జీవక్రియను వేగవంతంగ చేసే బ్యాక్టీరియా పెరగడానికి బ్లాక్‌ టీ దోహదం చేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. బ్లాక్‌ టీ, గ్రీన్‌ టీలు రెండు పేగుల్లోని బ్యాక్టీరియాను వృద్ధి చేస్తున్నాయని, ఆ బ్యాక్టీరియా కారణంగా జీవక్రియ రేటు పెరుగుతోందని లాస్‌ ఏంజెలెస్‌, కాలిఫోర్నియా యూనివర్సిటీల సంయుక్త పరిశోధనలో తేలింది. తద్వారా ఆరోగ్యకరంగా బరువు తగ్గే వీలుంటుందని తెలిపారు. గ్రీన్‌ టీ, బ్లాక్‌ టీల్లోని పాలీఫినోల్స్‌ మెటబాలిజమ్‌ పెరగడానికి అవసరమయ్యే బ్యాక్టీరియా వృద్ధికి కారణమవుతున్నాయని తెలిపారు. కొన్ని ఎలుకలకు బ్లాక్‌ టీ లేదా గ్రీన్‌ టీని ఇచ్చి నాలుగు వారాల పాటు వాటి మెటబాలిజయ్‌ రేటును గమనించారు. బ్లాక్‌టీ తీసుకోని ఎలుకలతో పోల్చితే, దానిని తీసుకున్న ఎలుకలు బరువు తగ్గినట్లు గుర్తించారు.