రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌
MarinaSkies
Kizen

రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌

05-10-2017

రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌

రసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలకు గాను ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మక నోబెల్‌ అవార్డు లభించింది. ద్రావకంలో జీవ కణాలను గుర్తించి క్రియో ఎలక్ట్రాన్‌ మెక్రోస్కోపీని అభివృద్ధి చేసినందుకు వీరికి నోబెల్‌ బహుమతి ప్రకటించారు. 2017 సంవత్సరానికి గాను ప్రకటించిన ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అమెరికాకు చెందిన జోచిమ్‌ ఫ్రాంక్‌, స్విట్జర్లాండ్‌కు చెందిన జాక్స్‌ దుబోచెట్‌, యూకేకు చెందిన రిచర్డ్‌ హెండర్సన్‌ అందుకోనున్నారు. ఈ మేరకు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ప్రకటన జారీ చేసింది. ఇప్పటి వరకు రసాయన శాస్త్రంలో 109 సార్లు నోబెల్‌ పురస్కారాలు ఇవ్వగా, కేవలం ఒకే ఒక్కరు రెండుసార్లు అందుకున్నారు. బ్రిటన్‌కు చెందిన బయోకెమిస్ట్‌ ఫ్రెడెరిక్‌ శాంగర్‌ 1950, 1980లో నోబెల్‌ అందుకున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు వైద్య రంగం, భౌతిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతులను ప్రకటించగా, నేడు రసాయన శాస్త్ర విభాగంలో ఈ అవార్డును ప్రకటించారు.