డొనాల్డ్‌ ట్రంప్‌ నాకూ ప్రపోజ్‌ చేశాడు
MarinaSkies
Kizen

డొనాల్డ్‌ ట్రంప్‌ నాకూ ప్రపోజ్‌ చేశాడు

05-10-2017

డొనాల్డ్‌ ట్రంప్‌ నాకూ ప్రపోజ్‌ చేశాడు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గతంలో తనకూ ప్రపోజ్‌ చేశాడని ప్రముఖ హాలీవుడ్‌ నటి బ్రూక్‌ షీల్డ్స్‌ వెల్లడించారు. అయితే, ఆ ప్రతిపాదనను తాను తిరస్కరించానన్నారు. రెండో భార్య మార్లా మేపుల్స్‌తో విడాకులు తీసుకున్న వెంటనే ట్రంప్‌ తనకు ఫోన్‌ చేశాడని, అప్పుడు తాను ఒక సినిమా షూటింగ్‌లో ఉన్నానని తెలిపారు. నువ్వు అమెరికన్ల హృదయసామ్రాజ్ఞివి, నేను అమెరికాలో అత్యంత ధనవంతుడిని, మనిద్దరం కలిస్తే అందరికీ సంతోషం అంటూ డేట్‌కి రావాలని ప్రపోజ్‌ చేశాడు. నాకు బాయ్‌ ఫ్రెండ్‌ ఉన్నాడని చెప్పి ఆ ప్రతిపాదనను తిరస్కరించాను అని బ్రూక్‌ తాగాగా వెల్లడించారు.