భారత్‌ చెప్పింది వింటే వారికే లాభం : మాటిస్‌
MarinaSkies
Kizen

భారత్‌ చెప్పింది వింటే వారికే లాభం : మాటిస్‌

05-10-2017

భారత్‌ చెప్పింది వింటే  వారికే లాభం  : మాటిస్‌

టెర్రరిజం అంశంలో భారత్‌ చెప్పేదానికి అనుగుణంగా నడుచుకుంటే దాని నుంచి బలమైన ఆర్థిక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందని అమెరికా రక్షణ మంత్రి జిమ్‌ మాటిస్‌ పాకిస్థాన్‌కు హితవు చెప్పారు. భారత్‌ కోరినట్లుగా పాక్‌ నుంచి ఉగ్ర స్థావరాలను గెంటివేస్తే మంచిదని చెప్పారు. పాక్‌ను ఉగ్రవాదుల స్వర్గధామంలా చేయవద్దని కోరారు. శక్తివంతమైన అమెరికా సెనేట్‌ సాయుధ సర్వీసులు కమిటీ ముందు ఆయన మాట్లాడారు. ఈ విషయంలో ట్రంప్‌ ప్రభుత్వం చాలా సృష్టతో ఉందని వివరించారు. పాక్‌ ప్రభుత్వం నుంచి చేయగలిగినదంతా చేస్తామని హామీ రాబట్టడానికి శాయశక్తులా కృషి చేస్తున్నట్లు తెలిపారు.