ఆ విషయం గురించి నాకు తెలియదు : ట్రంప్
MarinaSkies
Kizen

ఆ విషయం గురించి నాకు తెలియదు : ట్రంప్

04-10-2017

ఆ విషయం గురించి నాకు తెలియదు : ట్రంప్

అమెరికాలోని లాస్‌ వెగాస్‌ లో ఓ దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 59 మంది ప్రాణాలు కోల్పోయారు. 500 మందికి పైగా గాయపడ్డారు. ఘటన అనంతరం దుండగుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో కాల్పులకు తెగబడింది తమ సభ్యుడేనని ఐసిస్‌ ప్రకటించుకుంది. ఐసిస్‌ స్టేట్‌ మెంట్‌ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. దుండగుడికి ఐసిసి తో సంబంధం ఉందా? లేదా అన్న విషయంపై తనకు ఇంకా క్లారిటీ రాలేదని అన్నారు. దేశంలో తుపాకుల సంప్రదాయంపై వ్యాఖ్యానించడానికి ఇది సరైన సమయం కాదని అన్నారు. అయితే, తుపాకుల నియంత్రణపై చర్చ జరపాల్సిన అవసరం మాత్రం ఉందని చెప్పారు.