అల్పాహారం తీసుకోకపోతే గుండెకు చేటు!
MarinaSkies
Kizen

అల్పాహారం తీసుకోకపోతే గుండెకు చేటు!

04-10-2017

అల్పాహారం తీసుకోకపోతే గుండెకు చేటు!

రోజులో మొదటి భోజనాన్ని లైట్‌ తీసుకుంటున్నారా? ఉదయం టిఫిన్‌ మానేసి ఏకంగా మధ్యాహ్నమే భోజనం చేస్తున్నారా? అయితే మీ గుండె ప్రమాదంలో పడినట్టే. రోజులో ఉదయం పూట తీసుకునే మొదటి భోజనానికి దూరమైతే హృద్రోగాల బారిన పడే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అల్పాహారం తీసుకోని వారిలో ధమనులు కుచించుకుపోవడం, రక్తనాళాలు గట్టిపడడం వంటి ముప్పులు ఏర్పడుతున్నట్టు తమ పరిశోధనలో తేలిందని అమెరికాలోని టఫ్ట్స్‌ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. అంతేకాకుండా వారిలో నడుము చుట్టుకొలత, బీఎమ్‌ఐ (బాడీ మాస్‌ ఇండెక్స్‌), రక్తపోటు, రక్తంలో కొలెస్ట్రాల్‌ కూడా పెరుగుతున్నట్టు గుర్తించామన్నారు. పోషకాలతో కూడిన బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకునే వారి గుండె పనితీరు సమర్థంగా ఉంటుందని, కొలెస్ట్రాల్‌, శరీర బరువు కూడా తగినంతగా ఉంటుందని తెలిపారు.