ఫిజిక్స్‌లో ముగ్గురికి నోబెల్‌
MarinaSkies
Kizen

ఫిజిక్స్‌లో ముగ్గురికి నోబెల్‌

04-10-2017

ఫిజిక్స్‌లో ముగ్గురికి  నోబెల్‌

భౌతిక శాస్త్రంలో విశేష పరిశోధనలకు గాను ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మక నోబెల్‌ అవార్డును ఎంపికయ్యారు. 2017 సంవత్సరానికి గాను అమెరికాకు చెందిన రైనర్‌ వేస్‌, బ్యారీ సి.బ్యారిష్‌, కిప్‌ ఎస్‌ థోర్న్‌ లు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ శాస్త్రవేత్తల త్రయం గురుత్వాకర్షణ తరంగాలపై చేసిన పరిశోధనలకు గాను వారికి ఈ అరుదైన గౌరవం దక్కింది. దీంతో 1901 నుంచి ఫిజిక్స్‌ విభాగంలో నోబెల్‌ అందుకున్న 204 మంది జాబితాలో వీరు చోటు దక్కించుకున్నారు. ఈ విషయాన్ని స్వీడన్‌లోని స్టాక్‌హోంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నోబెల్‌ అసెంబ్లీ వెల్లడించారు. ఈ పురస్కారానికి ఎంపికైన వారిలో రైనర్‌ వేస్‌ మాసాచుసెట్స్‌ ఇన్ట్సిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఆచార్యుడు కాగా, కిప్‌ థోర్న్‌, బ్యారీ బ్యారిష్‌ కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో అధ్యాపకులు.