మధురవాణి.కామ్ విడుదల .. చదవండి..ఆనందిచండి.స్పందిచండి....అంతా ఉచితమే
MarinaSkies
Kizen

మధురవాణి.కామ్ విడుదల .. చదవండి..ఆనందిచండి.స్పందిచండి....అంతా ఉచితమే

04-10-2017

మధురవాణి.కామ్ విడుదల .. చదవండి..ఆనందిచండి.స్పందిచండి....అంతా ఉచితమే

మధురవాణి.కామ్ పత్రిక విడుదల 

www.mahd​uravani.com

ఈ సంచిక మా సంపాదకులకి చాలా సంతృప్తి గా ఉంది...మా కంటే ఎక్కువగా మీరే ఎక్కువ సంతోషిస్తారని మా నమ్మకం..ఎందుకంటే ..ఈ సంచికలో ..

దసరా -దీపావళి పోటీ విజేతల ప్రకటన...

బహుమతి పొందిన భలే మాంచి కథలు, కవితలు, వ్యాసాలు అనేకం...
గొల్లపూడి, భువన చంద్ర,, వి.ఎన్. ఆదిత్య, వంగూరి (అంటే నేనే సుమా), సత్యం మందపాటి, జ్యోతి వలబోజు, దీప్తి ముచ్చట్లు,  
అలనాటి మధురాలలో వెల్చేరు వారి కథ...
ఈ సంచిక చదవడానికి నాకే భలే సరదాగా ఉంది....ఇక మీకు ఇంకా బావుంటుంది అని వేరే చెప్పాలా?
ఈ సంచిక రూపొందించడానికి ఓవర్ టైమ్ పని చేసిన దీప్తి & శ్రీనివాస్ పెండ్యాల దంపతులకి ప్రత్యేక ధన్యవాదాలు.

10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు లో తలమునకలు అయిన కారణంగా ఈ సారి నేను ‘తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు సుమతీ”...అనగా ఎక్కువ సహాయం చెయ్యలేకపోయాను...ఏం చేస్తాం....కానీ నా "వంగూరి పి.పా' లో పుస్తక విమానం గురించి వ్రాసాను....చదివండి.. 

దసరా - దీపావళి రచనల పోటీ విజేతలు
కథా మధురాలు

ఉత్తమ కథ బహుమతులు:

అమ్మ దొంగా!  - ఓలేటి శశికళ
టంగ్... టంగ్... టంగ్... -కొల్లిపర హితేష్ 

ప్రశంసా బహుమతులు:

నిర్ణేత -కన్నెగంటి అనసూయ
దెయ్యాల వేళ- భవానీ ఫణి
లెక్క సరిపోయింది - గోవింద చింతాడ
మేలుకో నేస్తం -ప్రసూన రవీందర్
విధ్వంస రచన- మధుకర్ వైద్యుల
భలే మలుపు - రాజేష్ యాళ్ళ
కల కానిది - పి.బి. రాజు
బోధ వృక్షం - ఎమ్వీ రామిరెడ్డి
కనకాలు-హైమావతి ఆదూరి

కవితా వాణి

ఉత్తమ కవిత బహుమతులు

మరో మొదటి కథ-       లక్ష్మీ నారాయణ తుట్టగుంట 
నేనంటే నేనే కాదు-     మానస చామర్తి 
ప్రశంసా బహుమతులు

చిరునవ్వు -      ఫణీంద్రరావు కొనకళ్ళ
ధ్యాన ముద్ర-   శైలజామిత్ర
అందమైన అట్టపెట్టెలో- వారణాసి నాగలక్ష్మి
వర్షించే కళ్ళు...- డా. జడా సుబ్బారావు
కొత్త బొమ్మ - పూండ్ల మహేష్

వ్యాస మధురాలు

ఉత్తమ వ్యాస బహుమతులు: మూడు సమాన బహుమతులు

నవరసమేళనం - భక్తిరసోన్మీలనం - ప్రహ్లాదోపాఖ్యానం      - తంత్రవహి శ్రీరామమూర్తి
జీవమున్న నవల -ఒక్క వాన చాలు - శివుని రాజేశ్వరి
ఆధునిక కవిత్వంలో 'మా ఊరు" భావన - జడ సుబ్బారావు

విజేతలకి అభినందనలు!​

వంగూరి చిట్టెన్ రాజు