క్షమాపణలు చెప్పిన ఫేస్ బుక్ సీఈఓ
MarinaSkies
Kizen

క్షమాపణలు చెప్పిన ఫేస్ బుక్ సీఈఓ

03-10-2017

క్షమాపణలు చెప్పిన ఫేస్ బుక్ సీఈఓ

సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్‌ చూపిన వ్యతిరేక ప్రభావానికి బాధ్యత వహిస్తూ ఆ సంస్థ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ బహిరంగ క్షమాపణలు చెప్పారు. కొన్ని సందర్భాల్లో ఫేస్‌బుక్‌ ప్రజలను కలపడం కంటే విడదీయటానికి ఎక్కువ ఉపయోగపడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేకించి ఓ సంఘటననూ జుకర్‌బర్గ్‌ ప్రస్తావించినప్పటికీ, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేసేందుకు రష్యా ఫేస్‌బుక్‌ను ఉపయోగించిందనడానికి సాక్ష్యాలు లభిస్తున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జుకర్‌ బర్గ్‌ తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో ఓ పోస్ట్‌ చేస్తూ ఈ ఏడాది నేను ఎవరెవరినీ బాధపెట్టానో వారందరినీ క్షమాపణలు కోరుతున్నాను. ఫేస్‌బుక్‌ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తాను అని పేర్కొన్నారు. 2015 జూన్‌ నుంచి 2017 మే మధ్య ఓ రష్యా కంపెనీ ఇచ్చిన మూడు వేల ఫేస్‌బుక్‌ ప్రకటనల ప్రతులను కాంగ్రెస్‌కు సమర్పిస్తామని ఫేస్‌బుక్‌ ఇదివరకే ప్రకటించింది. ఈ ప్రకటనల విలువ లక్ష డాలర్లనీ, 470 నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాల నుంచి ఈ ప్రకటనలు వచ్చాయని ఫేస్‌బుక్‌ తెలిపింది.