ట్రాయ్‌లో తానా 5కె రన్‌
MarinaSkies
Kizen

ట్రాయ్‌లో తానా 5కె రన్‌

03-10-2017

ట్రాయ్‌లో తానా 5కె రన్‌

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ట్రాయిలోని ఫైర్‌ఫైటర్స్‌ పార్కులో మన ఊరి కోసం-5కె రన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డెట్రాయిట్‌ పరిసర ప్రాంతల ప్రవాసులు పెద్ద  సంఖ్యలో ఉల్లాసంగా పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 40కు పైగా నగరాల్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా  అందే నిధులను స్వదేశంలో ప్రవాసులు ఎంచుకున్న గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం వెచ్చిస్తామని తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ శృంగవరపు నిరంజన్‌ తెలిపారు.

ఈ పరుగలో తానా మాజీ అధ్యక్షులు డా.బండ్ల హనుమయ్య, నాగెళ్ల గంగాధర్‌, ప్రవాస ప్రముఖులు కాట్రగడ్డ కృష్ణప్రసాద్‌, నిమ్మగడ్డ శ్రీనివాస్‌, దిలీప్‌ కూచిపూడి, అశోక్‌ కొల్లా, సూరపనేని లక్ష్మీ నారాయణ, చిత్తలూరి శ్రీనివాస్‌, చిలుకూరి రాంప్రసాద్‌, బేతంచెర్ల ప్రసాద్‌, ఆలపాటి కృష్ణ ప్రసాద్‌, చెంచురెడ్డి, బచ్చు సుధీర్‌, దుగ్గిరాల కిరణ్‌, బొల్లపల్లి శ్రీ, వెలగా శుభకర్‌ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమ ఏర్పాట్లను పెద్దిబోయిన జోగేశ్వరరావు, పంత్ర సునీల్‌లు పర్యవేక్షించారు.


Click here for Event Gallery