బాటా ఆధ్వర్యంలో ఎస్ పిబి కచేరీ 18న

బాటా ఆధ్వర్యంలో ఎస్ పిబి కచేరీ 18న

12-03-2017

బాటా ఆధ్వర్యంలో ఎస్ పిబి కచేరీ 18న

బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మార్చి 18వ తేదీన ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం స్వర్ణోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, ఐ బ్రిడ్జ్‌ కూడా ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నాయి. శాన్‌హోసెలోని సిటీ నేషనల్‌ సివిక్‌లో ఈ కార్యక్రమం జరగనున్నది. ప్రముఖ గాయని చిత్రతోపాటు ఎస్‌పి. శైలజ, ఎస్‌పి. చరణ్‌ తెలుగువారికి ఇష్టమైన పసందైన పాటలను పాడనున్నారు. వీరితోపాటు టాలీవుడ్‌ సింగర్‌లు కూడా వస్తున్నారని నిర్వాహకులు చెప్పారు. ఈ కార్యక్రమానికి గ్రాండ్‌ స్పాన్సర్‌గా కాల్‌హోమ్స్‌ వ్యవహరిస్తోంది. ఇతర వివరాలకు బాటా వెబ్‌సైట్‌ను సందర్శించి తెలుసుకోవచ్చు.

http://www.bata.org