'తానా'లో చిత్తూరు జిల్లాకు అగ్రస్థానం
Sailaja Reddy Alluddu

'తానా'లో చిత్తూరు జిల్లాకు అగ్రస్థానం

12-03-2017

'తానా'లో చిత్తూరు జిల్లాకు అగ్రస్థానం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కార్యవర్గంలో మరోసారి చిత్తూరు జిల్లా వాసులు  కీలకపాత్ర పోషిస్తున్నారు. తానా ఆవిర్భావ సమయంలో చికాగోలో ఉన్న చిత్తూరు జిల్లాకు  చెందిన గల్లా  రామచంద్రనాయుడు, అరుణకుమారిలు ప్రముఖ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. వారు ఇప్పటికీ తానా మహాసభలకు హాజరవుతూ తానాతో తమకు ఉన్న అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. తానా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్న ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ సతీష్‌ వేమన పుట్టింది కడప జిల్లా అయినా చదువుకుంది. పెరిగింది చిత్తూరు జిల్లాలోనే. ఇప్పుడు జరుగుతున్న తానా ఎన్నికల్లో చిత్తూరు జిల్లాకు చెందినవాళ్ళు పోటీపడటంతోపాటు ఏకగ్రీవంగా ఎన్నికై తానాపై మరోమారు చిత్తూరు జిల్లా పట్టును పెంచారు. రాకీ మౌంటెయిన్స్‌ ప్రాంతీయ ప్రతినిధిగా తిరుపతికి చెందిన గెలాక్సీ టెక్నాలజీస్‌ సంస్థ వ్యవస్థాపకులు విజయ్‌ కొమ్మినేని, నార్త్‌ సెంట్రల్‌ రీజినల్‌ కో ఆర్డినేటర్‌గా  చిత్తూరు జిల్లాకు చెందిన లోసెట్టి రాజేంద్రప్రసాద్‌, మిచిగన్‌ ప్రాంతీయ ప్రతినిధిగా చిత్తూరుకు చెందిన డెట్రాయిట్‌ నివాసి పంత్ర సునీల ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే.