హెచ్-4 కొలువులపై ట్రంప్ కన్ను
APEDB
Ramakrishna

హెచ్-4 కొలువులపై ట్రంప్ కన్ను

11-03-2017

హెచ్-4 కొలువులపై ట్రంప్ కన్ను

హెచ్‌-1బీ వీసాదారులపై ఆధారపడి (డిపెండ్‌ంట్స్‌) అమెరికాకు వచ్చి, అక్కడ ఉద్యోగాలు చేసుకునే వారికి  ఉద్యోగాలకు ముప్పు ముంచుకొస్తోంది. విద్యార్హతలు, నైపుణ్యం ఉన్న వారు పెద్దసంఖ్యలో ఉంటున్నారు. ఇలాంటి వారు ఇంటికే పరిమితంకాకుండా, ఉద్యోగాలు చేయడం ద్వారా అమెరికా ఆర్థిక రంగం వృద్ధికి తోడ్పడుతున్నారు. తీవ్ర ప్రయత్నాలు, విన్నపాల తర్వాతే ఒబామా సర్కారు ఇందుకు అవకాశమిచ్చింది. ఈ నిర్ణయాన్ని కింది కోర్టు కూడా సమర్థించింది. ఇప్పుడు సేవ్‌ జాబ్స్‌, యూఎస్‌ఏ అనే సంస్థ దీనిని సవాలు చేస్తూ వాషింగ్టన్‌ డీసీ కోర్టు ఆశ్రయించింది. ఈ కేసులో ట్రంప్‌ సర్కారు దాఖలు చేసిన అఫిడవిట్‌ ఇప్పుడు హెచ్‌-4 వీసాదారుల్లో గుబులు రేపుతోంది.

సేవ్‌ జాబ్స్‌ యూఎస్‌ఏ సంస్థ వాదనకు ఆమోదం తెలిపేలా కోర్టు ప్రోసీడింగ్స్‌ను 60 రోజులపాటు నిలిపివేయాలి (అబేయన్స్‌) అని మాత్రమే ప్రభుత్వం కోరింది. ఇదే హెచ్‌-4 వీసాదారుల్లో ఆందోళనకు కారణమవుతోంది. పైగా అటార్నీ జనరల్‌ జెఫ్‌ సెషన్స్‌ హెచ్‌-1బీ వీసాలకు బద్ధవ్యతిరేకి కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అమెరికా న్యాయ విభాగం ఫిబ్రవరి 1వ తేదీన ఈ ఫైలు దాఖలు చేసింది. అంటే 60 రోజుల్లో సగంకాలం పూర్తయినట్లే, అమెరికాలో ప్రాధాన్యం. అమెరికన్లకు ఉపాధి అవకాశాల కల్పన మంత్రం జరిపిస్తున్న అధ్యక్షుడు ట్రంప్‌. హెచ్‌-4 వీసాదారుల ఉద్యోగాలకు వ్యతిరేకంగా స్పందించే అవకాశముందని భావిస్తున్నారు. దీనిని గట్టిగా వ్యతిరేకించకపోతే వేలాదిమంది హెచ్‌-4 వీసాహోల్డర్లకు ఇక్కట్లు  తప్పవని ఇమిగ్రేషన్‌ వాయిస్‌ సంస్థ అధ్యక్షుడు అమన్‌ కపూర్‌ పేర్కొన్నారు. హెచ్‌-4 వీసాదారుల తరపున ఆయన వాషింగ్టన్‌ డీసీ కోర్టులో పోరాడుతున్నారు.