ఫేస్‌బుక్‌ వినియోగదారులకు ఓ శుభవార్త
MarinaSkies
Kizen

ఫేస్‌బుక్‌ వినియోగదారులకు ఓ శుభవార్త

11-08-2017

ఫేస్‌బుక్‌ వినియోగదారులకు ఓ శుభవార్త

సామాజిక మాధ్యమ దిగ్జ సంస్థ ఫేస్‌బుక్‌ తన వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు వీడియోల ప్రత్యక్ష ప్రసారాల సౌకర్యాన్ని అందించడానికి సిద్ధమైంది. దీంతో యూట్యూబ్‌, నెట్‌ఫ్లిక్స్‌ వంటి సామాజిక మాధ్యమాలకు ఫేస్‌బుక్‌ గట్టి పోటీని ఇవ్వనుంది. వాచ్‌ అనే ప్రత్యేక సదుపాయం ద్వారా రియాలిటీ, హాస్య, క్రీడల ప్రత్యక్ష ప్రసారాలను వినియోగదారులు చూడవచ్చని సంస్థ తెలిపింది. స్నేహితులు చూసిన, మీకు ఇష్టమైన షోలను క్రమం తప్పకుండా చూడవచ్చని ఫేస్‌బుక్‌ సీఈవో జుకర్‌బర్గ్‌ తెలిపారు. ఏదైనా షోలోని భాగాన్ని (ఎపిసోడ్‌) చూస్తున్న వారితో సంభాషించడంతో పాటు అలాంటి అభిరుచి గలవారితో ఒక సముహాన్ని ఏర్పాటు చేసే సౌకర్యాన్నీ దీనిలో పొందుపరిచారు.