బొస్టన్ లో ప్రారంభమైన నాట్స్ చాప్టర్
MarinaSkies
Kizen

బొస్టన్ లో ప్రారంభమైన నాట్స్ చాప్టర్

17-07-2017

బొస్టన్ లో ప్రారంభమైన నాట్స్ చాప్టర్

అమెరికాలో తెలుగుజాతికి అండగానిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం తన పరిధిని మరింత పెంచుకుంటోంది. అమెరికాలోని ప్రతి నగరంలో నాట్స్ చాప్టర్లు ప్రారంభమవుతున్నాయి. ఈక్రమంలోనే బొస్టన్ నాట్స్ చాప్టర్ ప్రారంభమైంది.  పవన్ వేమూరి నాయకత్వంలో బొస్టన్ లో నాట్స్ చాప్టర్ కు శ్రీకారం చుట్టారు. నాట్స్ అధ్యక్షుడు మోహనకృష్ణ మన్నవ తో పాటు నాట్స్ జాతీయ ప్రతినిధులు శ్రీహరి మందాడి, వంశీకృష్ణవెనిగళ్ల , సూర్య గుత్తికొండ లు బొస్టన్ చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. తెలుగువారి కోసం నాట్స్చేపడుతున్న కార్యక్రమాలను మోహన కృష్ణ మన్నవ వివరించారు.. నాట్స్ ఈస్ట్జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి బోస్టన్ చాప్టర్ ప్రారంభంలో కీలకపాత్ర పోషించారు. బొస్టన్ లో ఇక ముందు నాట్స్ తన సేవా కార్యక్రమాలను ముమ్మరం చేస్తుందని శ్రీహరి మందాడి అన్నారు. తెలుగువారి కోసం నాట్స్చేస్తున్న కృషిని చూసే తాము బొస్టన్ లో నాట్స్ చాప్టర్ ప్రారంభించాలనిముందుకొచ్చినట్టు నాట్స్ బొస్టన్ చాప్టర్ సమన్వయకర్త పవన్ వేమూరి అన్నారు. బొస్టన్ లో నాట్స్ నాయకత్వాన్ని ఈ ప్రారంభోత్సవ వేడుకలో పరిచయం చేశారు.సునీల్ కొల్లి,  శ్రీధర్ గోరంట్ల,  కల్యాణ్ కాకి, సునీల్ కంభంపాటి, రాజేష్పాటిబండ్ల,  రాఘవ నన్నూరి,  శ్రీనివాస్ గొంది, గౌతమ్ చుండూరు, ప్రసాద్లక్కల తదితరులు ఇక ముందు బొస్టన్ నాట్స్ చాప్టర్ ను ముందుకు నడిపించడంలో తమవంతు పాత్ర షోషిస్తారని పవన్ వేమూరి తెలిపారు.


Click here for Event Gallery