కోహ్లీ న్యూయార్క్‌ పర్యటన ముగిసింది
MarinaSkies
Kizen

కోహ్లీ న్యూయార్క్‌ పర్యటన ముగిసింది

17-07-2017

కోహ్లీ న్యూయార్క్‌ పర్యటన ముగిసింది

భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ న్యూయార్క్‌ పర్యటన ముగిసింది. ఛాంపియన్స్‌ ట్రోఫీ, వెస్టిండీస్‌ పర్యటనలతో బిజీగా గడిపిన కోహ్లీ కాస్త సేదతీరేందుకు న్యూయార్క్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విహారయాత్రను ముగించుకున్న కోహ్లీ స్వదేశానికి బయలుదేరినట్లు సమాచారం. న్యూయార్క్‌లోని ప్రముఖ ప్రదర్శనశాలను సందర్శించిన కోహ్లీ, ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఆ తర్వాత ఓ కారులో ప్రయాణిస్తున్న ఫొటోను పంచుకున్న కోహ్లీ తిరిగి యథాస్థితికి అని పేర్కొన్నారు. దీంతో కోహ్లీ భారత్‌కు పయనమైనట్లు తెలుస్తోంది.