మాట విని పనిచేసే రోబోలు!
MarinaSkies
Kizen

మాట విని పనిచేసే రోబోలు!

17-07-2017

మాట విని పనిచేసే రోబోలు!

చెప్పిన మాట విని మనుషుల కంటే వేగంగా పనిచేసే రోబోలను శాస్త్రవేత్తలు రూపొందించారు. అమెరికాలోని బ్రౌన్‌ యూనివర్సిటీ పరిశోధకుల బృందం నోటితో ఆదేశాలు ఇవ్వగానే ఆటోమేటిక్‌గా పాటించే రోబోలను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఈ బృందంలో భారత సంతతి శాస్త్రవేత్తలు ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ రోబోలు చేసే పనిలో వివిధ దశలు లేకపోతే 90 సెకన్ల సమయంలో స్పందిస్తున్నాయి. అలా కాకుండా వివిధ దశల్లో పని చేయాల్సి వస్తే మరో 20 సెకన్లు అదనంగా తీసుకుంటున్నాయి. సహజ భాషకు, గ్రంథస్త భాషకు తేడా ఉండడం వల్ల ఆదేశాలు పాటించడంలో ఒక్కోసారి విఫలమవుతున్నాయి వర్సిటీ శాస్త్రవేత్త టెల్లెక్స్‌ వివరించారు. ఇళ్లలో పని చేసే  ప్రదేశాల్లో సామాన్యులు చేయడమే తన లక్ష్యమని భారత సంతతి శాస్త్రవేత్త ఆర్ముగన్‌ తెలిపారు.