డొనాల్డ్‌ ట్రంప్‌ తన నిర్ణయాన్ని మార్చుకుంటారు!
MarinaSkies
Kizen

డొనాల్డ్‌ ట్రంప్‌ తన నిర్ణయాన్ని మార్చుకుంటారు!

17-07-2017

డొనాల్డ్‌ ట్రంప్‌ తన నిర్ణయాన్ని మార్చుకుంటారు!

పారిస్‌ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలుగుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంపై పునరాలోచనలో పడ్డట్టు సమాచారం. ఈ మేరకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మానుయేల్‌ మేక్రాన్‌ వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. పారిస్‌ ఒప్పందం విషయంలో ట్రంప్‌ తన వైఖరి మార్చుకునే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన మరికొన్ని నెలల్లో ఒక పరిష్కారాన్ని ఆలోచించి చెబుతానని ట్రంప్‌ చెప్పినట్లు మేక్రాన్‌ తెలిపారు. ఇటీవల ట్రంప్‌ ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ఇరు దేశాధ్యక్షుల మధ్య పారిస్‌ వాతావరణ ఒప్పందం గురించి చర్చలు జరిగాయి. పారిస్‌ వాతావరణ ఒప్పందంలోకి మళ్లీ వచ్చే విధంగా అన్ని సవిరంగా మాట్లాడానని మేక్రాన్‌ తెలిపారు.