ఐదేళ్లలో అమెరికాలో రూ.6,500 కోట్ల పెట్టుబడులు
MarinaSkies
Kizen

ఐదేళ్లలో అమెరికాలో రూ.6,500 కోట్ల పెట్టుబడులు

17-07-2017

ఐదేళ్లలో అమెరికాలో రూ.6,500 కోట్ల పెట్టుబడులు

అమెరికాలో వచ్చే ఐదేళ్లలో 100 కోట్ల డాలర్ల (రూ.6,500 కోట్లు) పెట్టుబడులు పెట్టాలని మహీంద్రా గ్రూప్‌ యోచిస్తోంది. ప్రస్తుతం రాబడిని 500 కోట్ల డాలర్లకు పెంచుకోవాలని పెట్టుబడులు పెడుతోంది. అమెరికాలో సంస్థకు 3వేల ఉద్యోగులు ఉన్నారు. సేవలు విస్తరిస్తుండటంతో మానవ వనరుల సంఖ్యా పెరగనుంది. వివిధ వ్యాపారాల్లో ఇప్పటి వరకు 100 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టాం. వచ్చే ఐదేళ్లలో మరో 100 కోట్లు పెడతాం అని ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పవన్‌ గోయెంకా తెలిపారు. మహీంద్రా గ్రూప్‌ అమెరికా తపాలా సేవల కాంట్రాక్టుకు బిడ్‌ వేసిందన్నారు. ఇది జరిగితే ఆ దేశంలో తమ గ్రూప్‌ గణనీయ వృద్ధి సాధిస్తుందన్నారు. ప్రస్తుతం ఏడు రకాల వ్యాపారాల్లో మహాంద్రాకు 250 కోట్ల డాలర్ల రాబడి వస్తోంది. రాబోయే ఐదేళ్ల కాలంలో 500 కోట్లు లక్ష్యంగా పెట్టుకొంది.