డొనాల్డ్‌ ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ
MarinaSkies
Kizen
APEDB

డొనాల్డ్‌ ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ

15-07-2017

డొనాల్డ్‌ ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ

అమెరికాలో ప్రవేశించకుండా ఆరు ముస్లిం దేశాల పౌరులపై ఆంక్షలు విధించిన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వానికి న్యాయస్థానంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. తొలుత సుప్రీంకోర్టు అమెరికాలో నివసిస్తున్న ఆయా దేశాల వ్యక్తుల సమీప బంధువులకు ప్రవేశం కల్పిస్తూ ఆంక్షలను పాక్షికంగా సడలించింది. దీనిపై ప్రభుత్వం సమీప బంధువులు అన్న మాటకు నిర్వచనం ఇస్తూ ఆ జాబితాలో తాతలు, అమ్మమ్మ, నాన్మమ్మ లను మినహాయించింది. దీంతో హవాయి రాష్ట్ర ప్రభుత్వం హోనోలూలూలోని న్యాయస్థానాన్ని ఆశ్రయించగా వీరు కూడా సమీప బంధువుల కిందకే వస్తారని పేర్కొంది. ఇంగితజ్ఞానం ప్రకారం తాతలు, నాన్మమ్మలు కుటుంబ సభ్యులేనని, వారు లేకుండా కుటుంబం ఎక్కడిదని వ్యాఖ్యానించింది. వారినీ అనుమతించాలని ఆదేశించింది.