మీ భార్య చాలా బాగుంది : ట్రంప్
MarinaSkies
Kizen
APEDB

మీ భార్య చాలా బాగుంది : ట్రంప్

14-07-2017

మీ భార్య చాలా బాగుంది : ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫ్రెంచ్‌ ఫస్ట్‌ లేడీని పొగడ్తల్లో ముంచెత్తారు. ఇంకా ఫిట్‌గా, ఎంతో అందంగా ఉన్నారంటూ మెచ్చుకున్నారు. ఫ్రాన్స్‌ టూర్‌లో భాగంగా ఫస్ట్‌ లేడీ మెలానియాతో కలిసి పారిస్‌లోని  హోటల్‌ డెస్‌ ఇన్‌వాలిడెస్‌లో ఫ్రెంచ్‌ అధ్యక్షుడు మాక్రాన్‌, ఆయన భార్య బ్రిగిట్టీలను కలిశారు ట్రంప్‌. ఈ సందర్భంగా మాక్రాన్‌తో కరచాలనం చేసిన తర్వాత ఆయన భార్యతోనూ మాట్లాడారు. యు ఆర్‌ ఇన్‌ సచ్‌ ఎ గుడ్‌ షేప్‌ బ్యూటిపుల్‌ అంటూ ఇటు బ్రిగిట్టీతో చెబుతూ మాక్రాన్‌ వైపు చూశారు ట్రంప్‌. ఈ వీడియోను ఫ్రెంచ్‌ ప్రభుత్వం తమ అధికారిక ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేసింది. ట్రంప్‌ ప్రశంసను హుందా స్వీకరించిన బ్రిగిట్టీ నవ్వి ఊరుకున్నారు. ట్రంప్‌ మెచ్చుకోలుగానే ఈ వ్యాఖ్యలు చేసినా సోషల్‌ మీడియా మాత్రం ఆయనను తీవ్రంగా తప్పుబట్టింది. అవి సెక్సిస్ట కామెంట్స్‌ అని ట్రంప్‌ను విమర్శించారు నెటిజన్లు.