న్యూయార్క్‌లో ఐఫా 2017 వేడుకలు
MarinaSkies
Kizen
APEDB

న్యూయార్క్‌లో ఐఫా 2017 వేడుకలు

14-07-2017

న్యూయార్క్‌లో ఐఫా 2017 వేడుకలు

న్యూయార్క్‌లోని మైట్‌లైఫ్‌ స్టేడియంలో ఐఫా వేడుకలు కొనసాగుతున్నాయి. ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిలిం అకాడమీ అవార్డ్సు 18వ ఎడిషన్‌ అవార్డ్సు వేడుకలకు బాలీవుడ్‌ స్టార్లంతా తరలివచ్చారు. ఐఫా వేడుకలు జులై 13న ప్రారంభమవగా, అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జులై 14, 15 తేదీల్లో గ్రాండ్‌గా జరుగనుంది. మ్యూజిక్‌ సెన్షేనల్‌ ఏఆర్‌ రెహమాన్‌ నేతృత్వంలో సింగర్స్‌ బెన్నీ దయాల్‌, హరిహరన్‌, హరిచరణ్‌,  జొనిటా గాంధీ, కైలాశ్‌ ఖేర్‌, మికా సింగ్‌ మోహిత్‌ చౌహాన్‌, నీతి మోహన్‌, శ్వేత రావు, యాక్టర్స్‌ దిల్జీత్‌ దోసాంజ్‌, అతిథి రావు హైదరీ లైవ్‌ ఫర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టనున్నారు. ఐపా వేడుకలకు కరణ్‌జోహర్‌, సైఫ్‌ అలీఖాన్‌ హోస్ట్‌లుగా వ్యవహరించనున్నారు.

ఈ నేపథ్యంలో దర్శకనిర్మాత అనుపమ్‌ న్యూయార్క్‌లో ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేసి ఐఫా వేడుకల విశేషాలను తెలియజేశారు. బాలీవుడ్‌ స్టార్లు సల్మాన్‌ఖాన్‌, కత్రినాకైఫ్‌, వరుణ్‌ధావన్‌, షాహిద్‌కపూర్‌, కృతిసనన్‌, సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుట్‌, అలియాభట్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉడ్తా పంజాబ్‌ సినిమాకు బెస్ట్‌ యాక్టర్‌ కేటగిరీలో నామినేట్‌ అయిన షాహిద్‌ కపూర్‌ మాట్లాడుతూ ఉడ్తా పంజాబ్‌  దైర్యసాహసాలతో  తీసిని సినిమా అని, ఐఫా అవార్డుకు ఉడ్తా పంజాబ్‌ నామినేట్‌ కావడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రయోగాత్మకంగా తీసిన ఉడ్తా పంజాబ్‌ సినిమా అన్ని వర్గాల నుంచి ప్రశంసలందుతున్నట్లు పేర్కొన్నారు.