పారిస్‌ ఒప్పందంపై వైఖరి మార్చుకోనున్న డొనాల్డ్‌ ట్రంప్‌
MarinaSkies
Kizen
APEDB

పారిస్‌ ఒప్పందంపై వైఖరి మార్చుకోనున్న డొనాల్డ్‌ ట్రంప్‌

14-07-2017

పారిస్‌ ఒప్పందంపై వైఖరి మార్చుకోనున్న డొనాల్డ్‌ ట్రంప్‌

పర్యావరణ పరిరక్షణకు ఉద్దేశించిన పారిస్‌ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కాస్త మెత్తబడ్డట్టు కనిపిస్తోంది. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మేక్రాన్‌తో చర్చలు జరిపిన అనంతరం తన వైఖరిని కొంచం సడలించుకోనున్నట్లు తెలిపారు. పారిస్‌ ఒప్పందంపై ఏదో ఒకటి చేయాల్సి ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం అని వ్యాఖ్యానించారు. ఈ  ఒప్పందం అమెరికాకు అనుకూలంగా లేదని, దాన్ని అమలు చేయబోమని ఆరు వారాల క్రితం ఆయన ప్రకటించిన విషయం విదితమే. అమెరికా అభిప్రాయాలను గౌరవిస్తున్నామని చెప్పిన మేక్రాన్‌ చివరకు ట్రంప్‌ను ఒప్పించగలనని తెలిపారు.