డల్లాస్, టెక్సాస్ లో తానా – ఎస్పిఎంవివి సంగీతం కోర్సు ల్లో వంద మంది విద్యార్థులు నమోదు
Ramakrishna

డల్లాస్, టెక్సాస్ లో తానా – ఎస్పిఎంవివి సంగీతం కోర్సు ల్లో వంద మంది విద్యార్థులు నమోదు

11-03-2017

డల్లాస్, టెక్సాస్ లో తానా – ఎస్పిఎంవివి సంగీతం కోర్సు ల్లో వంద మంది విద్యార్థులు నమోదు

తానా అధ్యక్షులు డాక్టర్ జంపాల చౌదరి గారు  ప్రెస్‌మీట్లో "అమెరికాలోనే పురాతన, అతిపెద్దది సంస్థ అయిన తానా, ఎంతో ప్రఖ్యాతిగాంచిన శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం  అనుసంధానంతో చరిత్రలోనే మొట్టమొదటి  సారిగా సంగీతంలో  అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సులు ప్రారంభించింది.  మనసంస్కృతీ సంప్రదాయాలను పెంపొందించేందుకు తానా తీసుకున్న మరో మెట్టు ఇది. ఎంతో శ్రమించి అనేక నెలలుగా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ అధికారులతో చర్చలు జరిపి ఈకార్యక్రమం రూపుదాల్చుకునేందుకు కృషిచేసిన తానా పూర్వాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూరగారికి మరియు విశ్వవిద్యాలయ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.”

డాక్టర్ ప్రసాద్ తోటకూర - "తానా ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ అఫిలియేషన్‌ చైర్మన్" మాట్లాడుతూ  “1983 సంవత్సరంలోఆంధ్రప్రదేశ్‌ పూర్వముఖ్యమంత్రి శ్రీనందమూరి తారకరామారావుగారి మానసపుత్రికగా, ఆయన చేతులమీదుగా ప్రారంభించబడిన శ్రీపద్మావతి మహిళావిశ్వవిద్యాలయంతో  40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన తానా సంగీత కోర్సులు ప్రారంభించడం తానా చరిత్రలో ఒక మైలురాయి.  ఈ విశ్వవిద్యాలయం రూపొందించిన  సంగీత పాఠ్య ప్రణాళికను  ఉత్తర అమెరికా లోని  విద్యార్థులు పాటిస్తే, అమెరికా లోనే పరీక్షలు  వ్రాసి, అన్ని నాలుగు స్థాయిలు  పూర్తిచేసిన తరువాత యూనివర్సిటీ డిప్లొమా సర్టిఫికెట్స్  పొందవచ్చు. అమెరికా లో నివసిస్తున్న సంగీత ప్రియులు  తమ ప్రతిభా పాఠవాలను పరీక్షించుకోవాలనే దీర్ఘకాలిక కలను సాకారం చేసినందుకు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి. దుర్గా భవానీ, డీన్ప్రొఫెసర్ డి. శారద, మరియు  వారి సిబ్బంది సహకారానికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మన ఎన్నారై విద్యార్థులకు సంగీతం నేర్చుకోవడానికి, సంగీతంలో అడాన్స్‌ డిప్లొమా సర్టిఫికెట్‌ పొందడానికి ఇదొక గొప్ప అవకాశం. ఆసక్తి గల విద్యార్థులుఈ అవకాశాన్ని సద్వినియోగిచుకొని సంగీతం కోర్సుల్లో వెంటనే నమోదు కావల్సినదిగా విజ్ఞప్తి చేస్తున్నాను.”

శ్రీమతి మీనాక్షి అనిపిండి, తానా నేషనల్ మ్యూజిక్ కోఆర్డినేటర్ మాట్లాడుతూ “ఈ విధముగా ప్రారంభించిన సంగీత కోర్సుల్లో నమోదు చేసుకోవడం ద్వారా ఎన్నారై స్టూడెంట్స్ భారతదేశం ప్రయాణం చేయకుండానే అమెరికాలోనే  పరీక్షలు వ్రాసి,  డిప్లొమా సర్టిఫికెట్స్ పొందడానికి గొప్ప అవకాశం.  దీని వల్ల చాలా సమయం మరియు డబ్బు ఆదా అవుతుంది.  లెవెల్  1 మరియు లెవెల్  2 కోర్సులకు  వెంటనే  నమోదు చేసుకోమని సంగీత విద్యార్థులను ప్రోత్సహించవలసిందిగా ఉత్తర అమెరికా లోని తల్లిదండ్రులను మరియు సంగీత  ఉపాధ్యాయులను అభ్యర్ధిస్తున్నాను. ప్రతిష్ట్మాకమైన తానా సంస్థతోను మరియు తెలుగు భాషా సంస్కృతీ సంప్రదాయాలను అభిమానిస్తూ విదేశాలలో నిరంతరం విస్తరింపజేయు ప్రోత్సాహకులు, తానా మాజీ అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర గారి తో కలిసి  పని  చేయడం నాకు ఎంతో ఆనందదాయకం.”

డల్లాస్ లో తానా నిర్వహించిన “సంగీత కోర్సుల”నమోదు కార్యక్రమంలో  వందకు పైగా విద్యార్థులు పాల్గొని, ఎంతో ఉత్సాహభరితంగా  లెవెల్  1 మరియు లెవెల్  2 లో  నమోదయ్యారు.

ఉత్తర అమెరికా లో నివసిస్తున్న ఆసక్తి గల విద్యార్థులెవరైనా మార్చి 20, 2017 లోగా ఈ కోర్సుల్లో నమోదు కావచ్చు.

డాక్టర్ ప్రసాద్ తోటకూర మరియు  శ్రీమతి మీనాక్షి అనిపిండి ఒక సంయుక్త ప్రకటనలో మరిన్ని ఈ క్రింది వివరాలు తెలిపారు:

Academic Programs: (MUSIC)

*         Level 1 – Diploma in Introductory Music

*         Level 2 – Diploma in Music

*         Level 3 – Diploma in Music

*         Level 4 – Advanced Diploma in Music 

  ప్రస్తుతం, విద్యార్థులు లెవెల్  1 మరియు లెవెల్ 2 సంగీతం కోర్సుల్లో నమోదు కావచ్చు.

  పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఒక్కో లెవెల్ కు 12 క్రెడిట్స్ ఇస్తుంది.

  పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంనుండి విద్యార్థులు అందుకున్న డిప్లొమాలు ఎన్నారై విద్యార్థులకు అదనపు విద్యా కార్యక్రమంగా భావిస్తారు. అమెరికాలోని కొన్ని విశ్వవిద్యాలయాలు ఈ క్రెడిట్స్ ను గుర్తించవచ్చు. కాబట్టి, మేము వారు విశ్వవిద్యాలయాల్లో  దరఖాస్తు చేసినప్పుడు వారి సంబంధిత అధికారులతో తనిఖీ చేసుకోవాలని విద్యార్థులను సూచిస్తున్నాము.

  విద్యార్థులు ఉత్తర అమెరికాలో ఎక్కడనుంచి అయినా   ఏ సంగీత ఉపాధ్యాయుల  నుండి సంగీతం నేర్చుకోవచ్చు.

  ఈ సంగీత కోర్సుల్లో నమోదుకు కనీస వయసు 10 సంవత్సరాలు మరియు విద్యార్థినులు మాత్రమే నమోదు కాగలరు.

  పరీక్షా ఫీజు తో కలిపి ఒక్కో లెవెల్ కు ఫీజు 300 డాలర్లు మాత్రమే.

  లెవెల్  1,  2 మరియు  3 చివర్లో విద్యార్థుల నైపుణ్యత ను స్థానికముగా  తానా నేషనల్ మ్యూజిక్  కోఆర్డినేటర్ మరియు వారి బృందం కలిసి నిర్ణయిస్తారు. లెవెల్ 4కు  విశ్వవిద్యాలయ  అధికారులు వ్యక్తిగతంగా సమీక్షించి థియరీ అండ్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. అర్హత గల  గ్రాడ్యుయేట్ విద్యార్థులకు డిప్లొమాలను అమెరికాలో ఒక అధికారిక స్నాతకోత్సవం లో బహుకరిస్తారు.

  ప్రతి లెవెల్ లో ఉత్తీర్ణులు అవ్వడానికి కనీసం 45% మార్కులు సాధించాలి.  70 శాతం  సాధిస్తే "డిస్టింక్షన్" గా పరిగణిస్తారు.

  దయచేసి నమోదు ఫారం కోసం www.tana.org ను సందర్శించి పేర్కొన్న విధంగా ప్రక్రియను పూర్తి చేయాలి.

మరిన్ని వివరాలకు: www.tana.org ను సందర్శించండి లేదా:

  శ్రీమతి మీనాక్షి అనిపిండి, తానా నేషనల్ మ్యూజిక్ కోఆర్డినేటర్ tanamusiccoordinator@gmail.com

  డాక్టర్ ప్రసాద్ తోటకూర, ఛైర్మన్- తానా ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ అఫిలియేషన్  at 817-300-4747 or tanaieachair@gmail.com

 డాక్టర్ జంపాల చౌదరి, తానాఅధ్యక్షులు- 937-475-7809 or president@tana.org

డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ఈ తానా సంగీత కోర్సులకు జాతీయ సమన్వయకర్త గా ఉండటానికి  అంగీకరించిన  శ్రీమతి మీనాక్షి అనిపిండి,  దీర్ఘకాలిక  డల్లాస్ నివాసి అని, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయనుండి సంగీతంలో బంగారు పతకంతో పట్టభద్రురాలైన వారని , ఆకాశవాణి లో ఏ  గ్రేడ్  కళాకారిణి అని,  అమెరికాలో ఉన్న గొప్పసంగీత విద్వాంసులలో ఒకరని కొనియాడారు.

ఈ కార్యక్రమం లో తానా ప్రాంతీయ ప్రతినిధి శ్రీకాంత్ పోలవరపు, తానా సంయుక్త కోశాధికారి డాక్టర్ రాజేష్ అడుసుమిల్లి పాల్గొని అధికసంఖ్యలో నమోదయిన విద్యార్థులకు, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి, టచ్ నైన్ రెస్టారెంట్ యాజమాన్యానికి, మీడియా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఉత్తర అమెరికా తెలుగుసంఘం ఎన్నికలను చూస్తుంటే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలంత సందడి కనిపిస్తోంది. పోటాపోటీ ప్రచారాలు, వివిధ నగరాల్లో పర్యటనలు, సామాజికమాధ్యమాల ద్వారా పోస్టులపై పోస్టులతో తానా ఎన్నికలు ఊపందుకున్నాయి. ఈసారి తానా ఎన్నికల్లో కొన్ని కీలక పదవులకు పోటీ జరుగుతోంది. కొన్ని పదవులకు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.