ట్రంప్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేసిన హవాయి
Ramakrishna

ట్రంప్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేసిన హవాయి

11-03-2017

ట్రంప్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేసిన హవాయి

ఆరు ముస్లిం దేశాల ప్రజల వలసలపై డొనాల్డ్‌ ట్రంప్‌ జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వును అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 50వ రాష్ట్రమైన హవాయి సవాల్‌ చేసింది. అధ్యక్షుడి డొనాల్డ్‌ ట్రంప్‌ ఉత్తర్వులను సవాల్‌ చేసిన తొలి రాష్ట్రంగా నిలిచింది. హనలులులోని ఫెడరల్‌ న్యాయస్థానంలో రాష్ట్రానికి చెందిన అటార్నీలు వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఏడు దేశాల ముస్లిం ప్రజల వలసలపై ఆంక్షలు విధిస్తూ జారీ చేసిన తొలి ఉత్తర్వునూ హవాయి గతంలో న్యాయస్థానంలో సవాల్‌ చేసింది. అయితే దేశవ్యాప్తంగా పలు కేసులు దాఖలవడంతో ఆ కేసును నిలిపి ఉంచారు. హవాయి ముస్లిం ప్రజలకు, పర్యాటకానికి, విదేశీ విద్యార్థులకు ట్రంప్‌ ఉత్తర్వు హాని కలిగిస్తుందని తాజాగా దాఖలు చేసిన వ్యాజ్యంలో హవాయి పేర్కొంది. హవాయి ఎప్పుడూ వివక్షరహితంగానే ఉందని, ఇది రాష్ట్రం ప్రత్యేకత అని అటార్నీ జనరల్‌ డగ్లస్‌ చిన్‌ చెప్పారు. రాష్ట్ర ప్రజల్లో 20 శాతం మంది విదేశాల్లో జన్మించిన వారని, లక్ష మంది ఇక్కడి పౌరులు కాదని, కార్మికుల్లో 20 శాతం మంది విదేశాల్లో జన్మించినవారేనని చిన్‌ పేర్కొన్నారు. జాతీయత ఆధారంగా ప్రయాణంపై నిషేధం విధించాలన్న ఆలోచన హవాయి ప్రజలకు రుచించలేదని చెప్పారు.