నేడు డొనాల్డ్‌ ట్రంప్‌కు పరీక్ష

నేడు డొనాల్డ్‌ ట్రంప్‌కు పరీక్ష

14-12-2019

నేడు డొనాల్డ్‌ ట్రంప్‌కు పరీక్ష

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మీద ప్రతిపక్షం పెట్టిన అభిశంసన తీర్మానంపై శనివారం (భారత కాలమానం) ఓటింగ్‌ జరగనుంది. ఉక్రెయిన్‌ నుంచి రాజకీయ లబ్దిని పొందేందుకు ట్రంప్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేది డెమోక్రాట్ల ప్రధాన అభియోగం. ఈ ఆరోపణలపై గురువాం మొదలైన జ్యుడీషియరీ విచారణ శుక్రవారం తెల్లవారుజాము వరకు సాగింది. ఇది పూర్తి కాగానే ఓటింగ్‌ చేపట్టాలని తొలుత భావించారు. కానీ కమిటీ సభ్యులకు విరామం అవసరమని శనివారం వాయిదా వేశారు. అభిశంసన చట్టంలోని రెండు అధికరణల కింద ఓటింగ్‌ జరుగుతుంది. అతి కీలక చర్చకు అర్థరాత్రి వేళను ఎంచుకొన్నామన్న చెడ్డపేరు ఇష్టం లేక పట్టపగలే ఓటింగ్‌ చేపడుతున్నట్లు డెమోక్రాట్లు చెబుతున్నారు.