భారత్‌కు అమెరికా విజ్ఞప్తి

భారత్‌కు అమెరికా విజ్ఞప్తి

14-12-2019

భారత్‌కు అమెరికా విజ్ఞప్తి

పౌరసత్వ సవరణ బిల్లుపై భారత్‌లో తలెత్తుతున్న తాజా పరిణామాలను లోతుగా గమనిస్తున్నామని అమెరికా సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. దేశంలో మతపరమైన మైనారిటీల హక్కులను పూర్తిస్థాయిలో పరిరక్షించాలని ఆయన భారత్‌కు విజ్ఞప్తి చేశారు. భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా మైనారిటీల హక్కులను పరిరక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు. భారత్‌ చేపట్టిన ఈ కొత్త సవరణ చట్టం వల్ల బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, అఫ్గానిస్తాన్‌కు చెందిన ముస్లిమేతర మైనారిటీలకు పౌరసత్వం లభిస్తుంది. చట్టప్రకారం అన్ని వర్గాలకు మత్వ స్వేచ్ఛను కల్పించడం అన్నది ఈ రెండు ప్రజాస్వామ్య దేశాల ఆశయమని విదేశాంగ విభాగం ప్రతినిధి తెలిపారు. దీనికి అనుగుణంగానే మైనారిటీల హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు.