అమెరికా- చైనాల మధ్య ఒప్పందం

అమెరికా- చైనాల మధ్య ఒప్పందం

14-12-2019

అమెరికా- చైనాల మధ్య ఒప్పందం

చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న అమెరికా, చైనా మధ్య వాణిజ్య మొదటి దశ చర్చలు ఎట్టకేలకు కొలిక్కి వచ్చాయి. ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిందని, ఓ అంగీకారానికి వచ్చామని చైనా వాణిజ్య పన్నుల శాఖ సహాయ మంత్రి వాంగ్‌ షావెన్‌ తెలిపారు. ఇక ఇరు దేశాల ఒప్పందపై సంతకం చేయాల్సి ఉందని తెలిపారు. ఈ ఒప్పందానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా ట్వీట్టర్‌ ప్రకటన చేశారు. మొదటి దశలో భాగంగా పలు అంశాలపై అంగీకారానికి వచ్చామని, గతంలో చర్చకు వచ్చిన పలు అంశాలపై సంస్థాగతంగా మార్పులు చేసేందుకు చైనా ఒప్పుకుందని ఆయన అన్నారు.