నిర్మల్‌జిల్లా జడ్‌పి హైస్కూల్‌కు ఆటా సహాయం

నిర్మల్‌జిల్లా జడ్‌పి హైస్కూల్‌కు ఆటా సహాయం

12-12-2019

నిర్మల్‌జిల్లా జడ్‌పి హైస్కూల్‌కు ఆటా సహాయం

అమెరికన్‌ తెలుగు అసోషియేషన్‌(ఆటా) అధ్వర్యంలో ఆటా వేడుకలు డిసెంబర్‌ 11న ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ జెడ్‌పీ హైస్కూల్‌ను బుధవారం ఆటా బందం సందర్శించింది. విద్యార్థులకు క్లాస్‌ రూం బెంచెస్‌, బ్యాక్‌ ప్యాక్‌ కిట్లను ఆటా బందం విద్యార్థులకు పంపిణి చేసింది. అనంతరం కంటి పరీక్షలను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆటా ప్రెసిడెంట్‌ పరమేశ్‌ బీంరెడ్డి, వేడుకలు చైర్మన్‌ భువనేశ్‌ భుజాలా, మధు బొమ్మినేని, అనిల్‌ బొడ్డిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఆటా వేడుకలు డిసెంబర్‌ 29వరకు జరగనున్నాయి. ఆటా ప్రతి సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

Click here for Event Gallery