బీటెక్‌ అమ్మాయికి బంపర్‌ ఆఫర్‌

బీటెక్‌ అమ్మాయికి బంపర్‌ ఆఫర్‌

23-10-2019

బీటెక్‌ అమ్మాయికి బంపర్‌ ఆఫర్‌

టాలెంట్‌ ఉంటే చాలు కంపెనీలు స్టూడెంట్‌లను వెతుక్కుంటూ వస్తాయి. లక్షల్లో ప్యాకేజీలు ఆఫర్‌ చేస్తూ ఎంచక్కా ఆఫర్‌ లెటర్‌ ఇచ్చేస్తాయి. తాజాగా సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ఓ బీటెక్‌ ఫైనలియర్‌ విద్యార్థినికి బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. లవలీ ప్రొఫెషన్‌ యూనివర్సిటీకి చెందిన తాన్యా అరోరాకు ఏకంగా సంవత్సరానికి రూ.42 లక్షల ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం వచ్చింది. మైక్రోసాఫ్ట్‌ సంస్థ పెట్టిన కోడింగ్‌ ఛాలెంజ్‌ను తాన్యా విజయవంతంగా పూర్తి చేసి ఈ ఆఫర్‌ కొట్టేసింది. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌లో ఆమె విధులు నిర్వర్తించనుంది. కాగా ఆ ప్రాంతంలో ఓ విద్యార్థికి లభించిన అతి పెద్ద ప్యాకేజీ ఇదేనని సదరు యూనివర్సిటీ ఓ ప్రకటనలో తెలిపింది. తమ క్యాంపస్‌లో రియల్‌ టైమ్‌ ప్రాజెక్టులు చేపడుతూ క్లాస్‌ రూమ్‌లో నేర్చుకున్న పాఠాలని ఇక్కడ అప్లై చేసే అవకాశాన్ని విద్యార్థులకు కల్పిస్తున్నామని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.