డొనాల్డ్‌ ట్రంప్‌ను ప్రధాని మోదీ అడగలేదు

డొనాల్డ్‌ ట్రంప్‌ను ప్రధాని మోదీ అడగలేదు

23-07-2019

డొనాల్డ్‌ ట్రంప్‌ను ప్రధాని మోదీ అడగలేదు

కశ్మీర్‌ సమస్యపై మధ్యవర్తిత్వం వహించమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను ప్రధాని మోదీ కోరలేదని విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ సృష్టం చేశారు. రాజ్యసభలో ఈ అంశంపై ఆయన మాట్లాడారు. పాక్‌తో ఉన్న అన్ని సమస్యలను ద్వైపాక్షింగానే చర్చిస్తామని తెలిపారు. సీమాతంర ఉగ్రవాదం నిలిపివేస్తే చర్చలు సాధ్యమన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలు సిమ్లా అగ్రిమెంట్‌, లాహోర్‌ డిక్లరేషన్‌ ప్రకారమే పరిష్కారం అవుతాయన్నారు. అయితే సభ్యుల నినాదాల మధ్య సభను12 గంటలకు వాయిదా వేశారు. కశ్మీర్‌ సమస్య జాతీయ అంశమని, జాతి ఐక్యతకు సంబంధించిన అంశంపై ఒకే గొంతు వినిపించాలని చైర్మన్‌ వెంకయ్యనాయుడు తెలిపారు.