ట్రంప్‌ వ్యాఖ్యలపై ఇంటా, బయటా దుమారం

ట్రంప్‌ వ్యాఖ్యలపై ఇంటా, బయటా దుమారం

17-07-2019

ట్రంప్‌ వ్యాఖ్యలపై ఇంటా, బయటా దుమారం

యూఎస్‌ కాంగ్రెస్‌ ప్రతినిధుల సభలోని నలుగురు మహిళా ప్రతినిధులు తమ స్వదేశాలకు వెళ్లిపోవాలంటూ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై ఇంటా, బయటా తీవ్ర దుమారం చెలరేగింది. ప్రతిపక్ష డెమోక్రాటిక్‌ పార్టీకి చెందిన ఈ మహిళా ప్రతినిధులపై ట్రంప్‌ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల ఆయన స్వపక్షంలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాస్కాకు చెందిన రిపబ్లికన్‌ సెనేటర్‌ లీసా ముర్కోవిస్కీ ట్రంప్‌ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ ఉండదని, అనుచితమైన, ఆమోదయోగ్యం కాని ఈ వ్యాఖ్యలకు అధ్యక్షుడు ఇకనైనా తెరదించాలని ఆమె ఫేస్‌బుక్‌లో చేసిన వ్యాఖ్యల్లో పేర్కొన్నారు. డెమొక్రాటిక్‌ పార్టీకి చెందిన మహిళా ప్రతినిధులు తమ స్వదేశాలకు వెళ్లిపోవాలంటూ అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలతో తాను తీవ్రంగా విభేదిస్తున్నట్టు న్యూజిలాండ్‌ ప్రధాని జసిండా ఆర్డెన్స్‌ తెలిపారు.