వరదలను కచ్చితంగా అంచనావేయొచ్చు!

వరదలను కచ్చితంగా అంచనావేయొచ్చు!

17-07-2019

వరదలను కచ్చితంగా అంచనావేయొచ్చు!

వరదలు సంభవించే సమయం, వ్యవధిని కచ్చితంగా అంచనావేసే సరికొత్త విధానాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు. అమెరికాలోని సిటీ కాలేజీ ఆఫ్‌ న్యూయార్క్‌కు చెందిన నరేశ్‌ దేవినేని, నాజర్‌ నజిబి ఈ విధానాన్ని కనుగొన్నారు. వరదల కాలపట్టికను కూడా ఈ విధానం ద్వారా నిర్ధారించవచ్చని వారు తెలిపారు. నదీ ప్రవాహం, వర్షపాతం, వాతావరణ ప్రతిబంధకాలను బట్టి వరదల వ్యవధిని అంచనావేయొచ్చని చెప్పారు. వరద నియంత్రిత డ్యామ్‌లు, బ్రిడ్జ్‌లు, పవర్‌ప్లాంట్లు తదితర కీలక మౌలిక సదుపాయాలపై దీర్ఘకాల వరద ముప్పును నివారించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని వారు వివరించారు.