అమెరికా ఏమీ చేయలేదు

అమెరికా ఏమీ చేయలేదు

20-05-2019

అమెరికా ఏమీ చేయలేదు

అమెరికా ఆంక్షలు తమ సంస్థ ఎదుగుదలను ఏమాత్రం అడ్డుకోలేవని హువావే చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(సిఇఒ) రెన్‌ జెన్గ్‌ఫ్‌ తెలిపారు. మహా అయితే కంపెనీ వృద్ధి రేటు కొంచెం తగ్గవచ్చేమో కానీ అంతకు మించి ఏమీ కాదని సిఇఒ విశ్వాసం వ్యక్తం చేశారు. షెన్‌జెన్‌లో జపాన్‌కు చెందిన విలేకరులతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 15న హువా వేపై అమెరికా ఆంక్షలు విధించిన తరువాత తొలిసారి ఆయన మీడియాతో మాట్లాడారు. వృదిధ రేటులో 20 శాతం తగ్గుదల ఉండవచ్చేమో అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అక్కడి చట్టాలను అతిక్రమిస్తూ తామే ఏమీ చేయలేదని రెన్‌ సృష్టం చేశారు. అమెరికా చెప్పిన విధంగా మేనేజ్‌మెంట్‌లో మార్పులు చేసే అవకాశం కానీ, అక్కడి ప్రభుత్వ పర్యవేక్షణకు అనుమతించే అవకాశం కానీ లేదని కూడా సిఇఒ సృష్టంగా చేశారు. తాము అమెరికా నుంచి చిప్ప్‌ను కొనుగోలు చేయకపోయిన నష్టం ఏమీ లేదని ఆయన చెప్పారు. ఇప్పటికే తాము ఈ పరిస్థితికి సిద్ధమైనట్లు ఆయన వెల్లడించారు.