డొనాల్డ్ ట్రంప్ ను దింపేయాల్సిందే

డొనాల్డ్ ట్రంప్ ను దింపేయాల్సిందే

20-05-2019

డొనాల్డ్ ట్రంప్ ను దింపేయాల్సిందే

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను దింపేయాల్సిందే. అభిశంసన ప్రక్రియ తెరమీదకు తెస్తాం అంటూ ఇప్పటివరకూ డెమొక్రటిక్‌ పార్టీ చట్టసభ సభ్యులు, సెనెటర్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయటాన్ని చూశాం. కానీ మొదటిసారిగా రిపబ్లికన్‌ పార్టీ చట్టసభ సభ్యుడు జస్టిస్‌ అమాష్‌ అధ్యక్షుడు ట్రంప్‌ తీరును తీవ్రంగా విమర్శించారు. ఆయన వ్యవహారశైలి పరిశీలిస్తే అభిశంసన ప్రక్రియ తప్పేట్టు లేదని జస్టిస్‌ ఆమాష్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికంటే ముందు మిచిగన్‌ సెనెటర్‌, అటార్నీ జనరల్‌ విలియం బార్‌పై పలు ఆరోపణలు చేశారు. రాబర్ట్‌ మ్యూలర్‌ నివేదికపై ప్రజల్ని అటార్నీ జనరల్‌ తప్పదోవ పట్టించారని ఆయన ఆరోపించారు.

రాబ్టర్‌ మ్యూలర్‌ నివేదికపై జస్టిస్‌ ఆమాష్‌ స్పందిస్తూ.. కాంగ్రెస్‌ (పార్లమెంట్‌)లో కొంతమంది సభ్యులు మ్యూలర్‌ నివేదికను చదివేశారు. న్యాయప్రక్రియను అధ్యక్షుడు ట్రంప్‌ అడ్డుకున్నారనడానికి అనేక ఉదాహరణలు ఈ నివేదికలో ఉన్నాయి. అధ్యక్షుడిపై అభిశంస ప్రక్రియ చేపట్టడానికి ఇందులో సరిపోయే సాక్ష్యాలు ఉన్నాయి అని అన్నారు. ట్విట్టర్‌లో ఆమాష్‌ వ్యాఖ్యలపై డెమొక్రాట్లు పెద్ద ఎత్తున స్పందించారు. తాను ప్రవేశపెట్టబోయే అభిశంసన తీర్మానానికి రిపబ్లికన్‌ చట్టసభ సభ్యుడు ఆమాష్‌ మద్దతు తెలుపుతాడని డెమోక్రాట్‌ రషీదా త్లెయిబ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.