26న తెలంగాణ సాంస్కృతికోత్సవం

26న తెలంగాణ సాంస్కృతికోత్సవం

17-03-2017

26న తెలంగాణ సాంస్కృతికోత్సవం

గ్రేటర్‌ అట్లాంటా తెలంగాణ సొసైటీ ఆధ్వర్యంలో కుమ్మింగ్‌లోని ఫోర్‌సిత్‌ కాన్ఫరెన్స్‌ సెంటర్‌లో నిర్వహించే తెలంగాణ సాంస్కృతికోత్సవానికి ప్రత్యేక అతిధిగా తెలంగాణ రాష్ట్ర రవాణశాఖ మంత్రి పి. మహేందర్‌ రెడ్డి హాజరవుతున్నారు. ముఖ్య అతిధిగా నగేష్‌ సింగ్‌ వస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. బుర్రకథ, ఒగ్గుకథ, సమ్మక్క సారక్క నృత్యరూపకం, పేరిణి డ్యాన్స్‌, లంబాడీ డ్యాన్స్‌, జానపద నృత్యాలు ఇలా ఎన్నో కార్యక్రమాలను ఇందులో ప్రదర్శిస్తారని ఈ ఈవెంట్‌కు కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న సునీల్‌ రెడ్డి కూతురు, అనిల్‌ బోదిరెడ్డి చెప్పారు. ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులైన ప్రశాంతి అసిరెడ్డి (ప్రెసిడెంట్‌), సతీష్‌ చెతి (చైర్మన్‌), వైస్‌ ప్రెసిడెంట్‌ నంద చాట్ల, సెక్రటరీ శ్రీధర్‌ నెలవెల్లి, ట్రెజరర్‌ శ్రీనివాస్‌ ఆవుల ఈ కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లను చూస్తున్నారు.