అమెరికా ఆర్మీలో మనోడికి రూ.1.2 కోట్ల ప్యాకేజీ!

అమెరికా ఆర్మీలో మనోడికి రూ.1.2 కోట్ల ప్యాకేజీ!

09-05-2017

అమెరికా ఆర్మీలో మనోడికి రూ.1.2 కోట్ల ప్యాకేజీ!

భారతీయులకు అమెరికా సైన్యంలో ఉద్యోగం రావడం అంటేనే విచిత్రం అనుకుంటే, అది కూడా కళ్లు తిరిగే ప్యాకేజీ వచ్చింది.  జైపూర్‌కు చెందిన మోనార్క్‌ శర్మ అనే వ్యక్తికి యూఎస్‌ ఆర్మీకి చెందిన ఏహెచ్‌ -64 ఈ కంబాట్‌ ఫైటర్‌ హెలికాప్టర్‌ యూనిట్‌లో సైంటిస్ట్‌గా ఉద్యోగం వచ్చింది. ఏడాదికి అతని జీతం రూ.1.2 కోట్లు కావడం విశేషం. ఈ ఏడాది యూఎస్‌ ఆర్మీలో చేరిన ఫైటర్‌ హెలికాప్టర్ల డిజైన్‌, పర్యవేక్షణ, తయరీ, నిర్వహణ బాధ్యతలను  మోనార్క్‌ చూసుకోవాల్సి ఉంటుంది. 2013లో నాసాలోని మాస్‌ కమ్యూనికేషన్‌ వింగ్‌లో మోనార్క్‌ శర్మ జూనియర్‌ రీసెర్చ్‌ సైంటిస్ట్‌గా తన కెరీర్‌ ప్రారంభించాడు. ఆ తర్వాత మే 2016లో యూఎస్‌ ఆర్మీలో చేరాడు. కాప్టర్ల డిజైనింగ్‌, పరిశోధనతో తన మార్క్‌ చూసిన మోనార్క్‌, ఈ ఏడాది కాలంలో రెండు ప్రతిష్టాత్మక ఆర్మీ అవార్డులు కూడా అందుకున్నారు. మోనార్క్‌ శర్మ జైపూర్‌లోని నేషనల్‌ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ చేశాడు. అతని తండ్రి ఓ ప్రభుత్వ ఉద్యోగి. నిజానికి ఇండియన్‌ ఆర్మీకి తాను సేవలు చేయాలని భావించినా అది కుదరలేదని, యూఎస్‌ ఆర్మీలో పని చేసి ఇండియాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని భావిస్తున్నట్లు శర్మ తెలిపారు.