కాలుష్యంతో కేన్సర్ ప్రమాదం

కాలుష్యంతో కేన్సర్ ప్రమాదం

09-05-2017

కాలుష్యంతో కేన్సర్ ప్రమాదం

కలుషిత వాతావరణంలో నివసిస్తున్న వారికి ప్రోస్టేట్‌ కేన్సర్‌, రొమ్ము కేన్సర్‌ ప్రమాదం పెరుగుతోందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. వాయు, జల కాలుష్యాలు ఈ ముప్పును పెంచుతున్నాయని యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయిస్‌ పరిశోధకులు తెలిపారు. ఎన్విరాన్‌మెంటల్‌ క్యాలిటీ ఇండెక్స్‌తో కేన్సర్‌ వచ్చే ప్రమాదాన్ని పోల్చిచూడగా ఈ విషయం వెల్లడైందన్నారు. లక్ష మందిలో అన్ని రకాల కేన్సర్లు కలిపి 451 కేసులు నమోదవుతున్నాయి. పర్యావరణ నాణ్యత అంతంత మాత్రమే ఉన్న ప్రాంతాల్లో అదనంగా మరో 39 కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మనం నివసించే ప్రాంతంలోని వాతావరణం కూడా కేన్సర్‌ రాకకు కారణమవుతోందని వర్సిటీకి చెందిన జోత్స్య ఎస్‌ జాగై వివరించారు.