కాటన్ బడ్స్ తో మంచి కన్నా చెడే ఎక్కువ

కాటన్ బడ్స్ తో మంచి కన్నా చెడే ఎక్కువ

09-05-2017

కాటన్ బడ్స్ తో మంచి కన్నా చెడే ఎక్కువ

చెవులను శుభ్రం చేసుకోవడానికి కాటన్‌బడ్స్‌ వంటి చెవి పుల్లలు వాడుతున్నారా? ఆ అలవాటు ఉంటే ఇకపై మానెయ్యడం మంచిదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. వాటితో చెవులకు మంచి కన్నా చెడే ఎక్కువ జరిగే ప్రమాం ఉందని హెచ్చరిస్తున్నారు. 1990 నుంచి 2010  మధ్యకాలంలో 18 ఏండ్ల కన్నా తక్కువ వయస్సు 2, 63,000 మంది పిల్లలు చెవుల్లో కాటన్‌ బడ్స్‌ ఉపయోగించి తీవ్రంగా బాధలుపడి చికిత్స పొందారని పరిశోధకులు తెలిపారు. చెవిలో గులిమి ఏర్పడితే చాలామంది కాటన్‌బడ్స్‌ వాడి తొలగించుకుంటారు. అయితే అది చాలా ప్రమాదకరం. గులిమిని తీసే ప్రయత్నంలో బడ్‌ దానిని కర్ణభేరి దగ్గరకు తోసేస్తుంది. దీనివల్ల చెవికి తీవ్ర హాని కలిగే అవకాశం ఉంది. గులిమిని చెవులు వాటంతట ఆవే శుభ్రపరుచుకుంటాయి. వాటిని మనం కాటన్‌బడ్స్‌ వాడి తీయాల్సిన అవసరం లేదు అని అమెరికాలోని నేషన్‌వైడ్‌ బాలల దవాఖానలో పనిచేసే ఈఎన్‌టీ నిపుణురాలు క్రిస్‌జటానా వివరించారు. చెవిపుల్లలు ఉపయోగిస్తే కరభేరికి, మనం శబ్దాలను వినడానికి ఉపకరించే ఎముకలకు నష్టం కలుగవచ్చని తెలిపారు. చెవులను శుభ్రం చేసుకోవాడానికి కాటన్‌బడ్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడరాదని ఆమె హెచ్చరించారు.