రగిలిపోతున్న ట్రంప్

రగిలిపోతున్న ట్రంప్

16-03-2017

రగిలిపోతున్న  ట్రంప్

సవరించిన ట్రావెల్ బ్యాన్ బిల్లును ఫెడరల్ కోర్టు అడ్డుకోవడాన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  తీవ్ర స్వరంతో పేర్కొన్నారు. మాటిమాటికీ అడ్డంకులు ఎదురవుతుండడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రగిలిపోతున్నట్టు కనిపిస్తోంది.  తాజా ట్రావెల్ బ్యాన్ బిల్లు సరిగ్గా కొద్ది గంటల్లో అమల్లోకి వస్తుందనగా... ఇది చట్టబద్దం కాదంటూ హవాయి ఫెడరల్ జడ్జి డెర్రిక్ వాట్సన్ నిలిపివేశారు. అంతేకాదు అమెరికాలోకి శరణార్థులు ప్రవేశించకుండా ట్రంప్ విధించిన 120 రోజుల నిషేధాన్ని (సెక్షన్6) కూడా కోర్టు నిలిపివేసింది.