ఎన్‌ఎస్‌జీలో భారత్‌ సభ్యత్వానికి యూఎస్‌ మద్దతు

ఎన్‌ఎస్‌జీలో భారత్‌ సభ్యత్వానికి యూఎస్‌ మద్దతు

16-03-2017

ఎన్‌ఎస్‌జీలో భారత్‌ సభ్యత్వానికి యూఎస్‌ మద్దతు

అణుసరఫరాదారుల బృందంలో (ఎన్‌ఎస్‌జీలో) భారత్‌కు సభ్యత్వం కల్పించే ప్రతిపాదనకు తాము పూర్తి మద్దతిస్తామని డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం తెలిపింది. దీంతో ఈ విషయమై అమెరికా గతంలో తీసుకున్న నిర్ణయంలో మార్పు ఉండబోదని సృష్టమయ్యింది. ఎన్‌ఎస్‌జీలో భారత్‌ చేరిక అంశంపై అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వం తీసుకోవటానికి భారత్‌ సిద్ధంగా ఉన్నట్లు భావిస్తున్నాం. ఈ అంశంలో భారత్‌కు పూర్తి మద్దతిస్తాం అని ప్రకటించారు.