చూపు కోల్పోయిన వారికి తిరిగి చూపు!

చూపు కోల్పోయిన వారికి తిరిగి చూపు!

16-03-2017

చూపు కోల్పోయిన వారికి తిరిగి చూపు!

వయసు కారణాల రీత్యా, రెటీనాలో న్యూరాన్ల సంబంధ వ్యాధుల వల్ల చూపు కోల్పోయిన వారికి తిరిగి చూపును ప్రసాదించే నానో ఇంప్లాంట్‌ను శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. కంటి మద్య భాగంలో ఉండే రెటీనా కాంతిని గుర్తించి దానిని న్యూరాన్ల ద్వారా మెదడుకు చేరవేయడం ద్వారా మనం ఎదుటి వస్తువులు, వ్యక్తులను చూడగలుగుతున్నాయి. అయితే రెటీనాకు సంబంధించిన న్యూరాన్లు నశిస్తే వాటిని తిరిగి పునరుజ్జీవింపజేసేందుకు చికిత్స కూడా లేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది చూపుకోల్పోతున్నారు. అటువంటి స్థితిలో ఉన్న వారికి రెటీనాకు తిరిగి కాంతిని గుర్తించే శక్తినిచ్చే సిలికాన్‌ నానోవైర్లతో కూడిన ఇంప్లాంట్‌ను శాస్త్రవేత్తలు రూపొందించారు. అమెరికాలోని నానోవి జన్‌ బయోసైన్సెస్‌ అనే స్టార్టప్‌, యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా శాండిగో శాస్త్రవేత్తల సంయుక్త పరిశోధన ఫలితమే ఈ నానో ఇంప్లాంట్‌. దీనిని ఎలుకలకు అమర్చి వారు చేసిన పరిశోధనలు విజయవంతమయ్యాయి. అయితే మనుషులకు అందుబాటులోకి తెచ్చేందుకు దీనిని మరింత అభివృద్ధి చేయాల్సి ఉందని వారు పేర్కొన్నారు.