కంప్యూటర్‌ సైన్స్‌ విద్యను ఆఫర్‌ చేస్తున్న మిస్సోరీ

కంప్యూటర్‌ సైన్స్‌ విద్యను ఆఫర్‌ చేస్తున్న మిస్సోరీ

16-03-2017

కంప్యూటర్‌ సైన్స్‌ విద్యను ఆఫర్‌ చేస్తున్న మిస్సోరీ

భారత విద్యార్థులు ఎంతగానో కోరుకునే కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీని అందించనున్నామని మిస్సోరీ స్టేట్‌ యూనివర్సిటీ పేర్కొంది. ఇప్పటికే తమ పరిధిలోని కాలేజీల్లో ఆర్ట్స్‌, డిజైన్‌, మీడియా, ఫిల్మ్‌ అండ్‌ జర్నలిజం కోర్సుల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యను గత నెలలో ప్రారంభించామని, ఇప్పుడు కంప్యూటర్‌ సైన్స్‌కు కూడా విస్తరించామని వర్సిటీ అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కల్నర్‌ స్టీఫెన్‌ రాబినెట్టీ వ్యాఖ్యానించారు. కంప్యూటర్‌ సైన్స్‌లో బ్యాచ్‌లర్‌ డిగ్రీని పూర్తిచేసిన వారు, 3 జీపీఏ స్కోర్‌, 305 జీఆర్‌ఈ, 79 టోఫెల్‌ స్కోర్లు ఉన్నావారు ఈ కోర్సులో ప్రవేశానికి అర్హులని తెలిపారు. ఆగస్టులో ప్రారంభమయ్యే కోర్సు వ్యవధి రెండేళ్లుగా ఉంటుందని, 12 వేల డాలర్లను ఫీజుగా చెల్లించాల్సి వుంటుందని వెల్లడించారు.