డొనాల్డ్‌ ట్రంప్‌ గుట్టు రట్టు!

డొనాల్డ్‌ ట్రంప్‌ గుట్టు రట్టు!

16-03-2017

డొనాల్డ్‌ ట్రంప్‌ గుట్టు రట్టు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌  ట్రంప్‌ గుట్టు రట్టయింది. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో 2005లో ఆదాయ పన్ను చెల్లింపు వివరాల గురించి ఆయన దాచిపెట్టిన విషయాలన్నీ తాజాగా బహిర్గతమయ్యాయి. పన్ను చెల్లింపు విషయంలో ట్రంప్‌ కక్కుర్తి పడ్డారని స్థానిక మీడియా సంస్థ ఎంఎస్‌ఎన్‌బీసీ పేర్కొంది. ఈ మేరకు వరుస కథానాలు ప్రసారం చేసింది. ఎంఎస్‌ఎన్‌బీసీ ప్రసారాలపై వైట్‌హౌస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ మీడియా సంస్థ బహిర్గతం చేసిన వివరాల ప్రకారం 2005లో ట్రంప్‌ ఆదాయ పన్ను చెల్లింపు వివరాలను ఉద్దేశపూర్వకంగానే  బయటపెట్టలేదు. ట్రంప్‌ చెల్లించాల్సిన పన్ను కంటే తక్కువ మొత్తాన్ని చెల్లించారని డెమొక్రాటిక్‌ పార్టీ నేత హిల్లరీ క్లింటన్‌ విమర్శించిన సంగతి తెలిసిందే.