2020లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడంపై తాను త్వరలోనే నిర్ణయం తీసుకొంటానని భారతీయ సంతతికి చెందిన తొలి మహిళా సెనేటర్ అయిన కమలా హారిస్ తెలిపారు. అంతేకాదు, దేశ అత్యున్నత పదవిని చేపట్టేందుకు నల్లజాతికి చెందిన ఒక మహిళను అమెరికా అధ్యక్షురాలిగా అంగీకరించడానికి ఈ దేశం సిద్ధంగా ఉందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో అమెరికన్లకు ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలని. అమెరికన్లు చాలా తెలివైనవారని, సమర్థుడని, నిజాయితీపరుడు, తమ కష్టాలను పట్టించుకునే వ్యక్తని ఎవరికి అనుకుంటారో అలాంటి వ్యకినే అధ్యక్షుడిగా వారు ఎన్నుకుంటారని అని కూడా ఆమె అన్నారు. తన గురించి తాను ఈ విషయం చెప్పడం లేదని, అమెరికా ప్రజల సామర్థం గురించి తాను ఈ విషయం చెబుతున్నాని అన్నారు. కమలా హారిస్ గతంలో కాలిఫోర్నియాకు తొలి మహిళా అటార్నీ జనర్గా కూడా ఉన్నారు. 2020లో జరిగే అధ్యక్ష ఎన్నిల్లో అమెరికా అధ్యక్ష పదవికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను డెమొక్రటిక్ పార్టీ తరపున అభ్యర్థిగా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్న బలమైన అభ్యర్థుల్లో హారిస్ ఒకరని ఇప్పటికే మీడియాలో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే.