విడాకులు తీసుకుంటున్న ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు

విడాకులు తీసుకుంటున్న ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు

10-01-2019

విడాకులు తీసుకుంటున్న ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, అమెజాన్‌ ఫౌండర్‌, సీఈవో జెఫ్‌ బెజోస్‌ తన భార్య మెకంజీ బెజోస్‌కు విడాకులు ఇవ్వబోతున్నాడు. 25 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత ఇప్పుడు విడాకులు తీసుకోవడం ఏంటన్న చర్చ జరుగుతున్నది. బెజోస్‌ విడాకుల అంశం కంపెనీపై, షేర్లపై ఎలాంటి ప్రభావం చూపకపోయినా, వాళ్ల మధ్య విభేదాలు తలెత్తడానికి గల కారణం తెలిసి ఇప్పుడు అందరూ ముక్కున వేలుసుకుంటున్నారు. నేషనల్‌ ఎంక్వైరర్‌ ఆ సీక్రెట్‌ను బయటపెట్టింది. జెఫ్‌ బెజోస్‌కు హాలీవుడ్‌ టాలెంట్‌ ఏజెంట్‌ పాట్రిక్‌ వైట్‌సెల్‌ భార్య లారెన్‌ సాంచెజ్‌తో అక్రమ సంబంధం ఉన్న కారణంగా మెకంజీ తన భర్తకు విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నట్లు ఎంక్వైరర్‌ వెల్లడించింది.

బెజోస్‌, సాంచెజ్‌ ఎనిమిది నెలల కిందట తొలిసారి కలిశారు. ఎంక్వైరర్‌ కొన్ని నెలలుగా ఈ ఇద్దరి కదలికలను గమనిస్తున్నది. ఐదు రాష్ట్రాల్లో 40 వేల మైళ్లు వాళ్ల వెంట సీక్రెట్‌ గా వెళ్లింది. వాళ్లు ప్రైవేటూ జెట్స్‌లో తిరగడం, ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో రహస్యంగా గడపడం, డిన్నర్‌ డేట్స్‌కు వెళ్లడంలాంటి విషయాలను బయటపెట్టింది. జెఫ్‌ బెజోస్‌, మేకంజీలకు నలుగురు పిల్లలు ఉన్నారు. తన సక్సెస్‌కు తన భార్యే కారణమని బెజోస్‌ పదే పదే చెబుతుంటారు. అలాంటి ఇద్దరూ విడాకులు తీసుకోవడం ఏంటని చాలా మంది ఆశ్చర్యపోయారు.