సాయికృష్ణ వైద్యానికి 10 లక్షల సాయం

సాయికృష్ణ వైద్యానికి 10 లక్షల సాయం

10-01-2019

సాయికృష్ణ వైద్యానికి 10 లక్షల సాయం

అమెరికాలో దుండగుల కాల్పుల్లో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహబూబాబాద్‌ వాసి సాయికృష్ణ వైద్యానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి మంజూరు చేసిన రూ.10 లక్షల చెక్కును సాయికృష్ణ తల్లిదండ్రులు పూస ఎల్లయ్య, శైలజకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అందజేశారు. వారు అమెరికా వెళ్లడానికి వీసాలు మంజూరు చేయించారు. సాయికృష్ణ తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కుమారుడి వైద్యం కోసం 10 లక్షల సాయం అందించిన కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.