హెచ్‌1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్‌ 3 నుంచి

హెచ్‌1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్‌ 3 నుంచి

16-03-2017

హెచ్‌1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్‌ 3 నుంచి

2018 ఆర్థిక సంవత్సరానికి హెచ్‌-1బీ వీసాలకు దరఖాస్తులను వచ్చే నెల 3 నుంచి స్వీకరించనున్నట్లు అమెరికా  పౌరసత్వం, వలస సేవల విభాగం(యూఎస్‌సీఐఎస్‌) ప్రకటించింది. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీని ఏటా ప్రకటించే యూఎస్‌సీఐఎస్‌. ఈ దఫా చెప్పకపోవడం గమనార్హం. సాధారణంగా ప్రారంభ తేదీ నుంచి మొదటి ఐదు పనిదినాల్లో దరఖాస్తుల సమర్పణను అనుమతిస్తారు. చట్టసభల ఆమోదం మేరకు 85వేల హెచ్‌-1బీ వీసాల మంజూరుకు వీలుగా తగినన్ని దరఖాస్తులను యూఎస్‌సీఐఎస్‌ స్వీకరిస్తుంటుంది.